నవ భారత్‌కు ఆకాశం కూడా హద్దు కాదు.. మీ ప్రధాని మా బిహారీ బిడ్డ: మోడీ

by Phanindra |   (  Updated:2025-07-04 13:57:01  IST  )

నవ భారత్‌కు ఆకాశం కూడా హద్దు కాదని, మీ ప్రధాని మా బిహారీ బిడ్డ అని ప్రధాని మోడీ అన్నారు. ఆయన ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తున్నారు.

నవ భారత్‌కు ఆకాశం కూడా హద్దు కాదు.. మీ ప్రధాని మా బిహారీ బిడ్డ: మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: నవ భారతానికి ఆకాశం కూడా హద్దు కాదని, అంతకుమించి భారత్ ఎదుగుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ అండ్ టోబాగో చేరుకున్న ఆయన.. ఆ దేశంలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. 1999 తర్వాత ఈ దేశంలో ఒక భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా పెర్సాద్ బిసెస్సార్, ఆమె కేబినెట్ సభ్యులు, ఇతర నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలోని భారతీయ కమ్యూనిటీపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. వీరంతా భారత నేలను వదిలి వచ్చినా, అక్కడి ఆత్మను వదల్లేదని మెచ్చుకున్నారు. ప్రధాని కమలా కుటుంబ మూలాలు కూడా భారత్‌లోని బిహార్‌లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆమెను ‘బిహార్ కీ బేటీ’ (బిహార్ బిడ్డ) అని పిలిచిన మోడీ.. ‘కమలా గారి పూర్వీకులు కూడా బిహార్‌లోని బక్సర్‌కు చెందిన వారే. ఆమె స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటించారు కూడా. ఆమెను అందరూ చాలా గర్వంగా ‘బిహార్ బిడ్డ’ అని పిలుస్తారు. ఇక్కడ చాలా మంది పూర్వీకులు బిహార్‌కు చెందినవారే’ అని వివరించారు.

Next Story