- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pm modi: ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్లేమీ రారు భయపడొద్దు.. ముద్రా లబ్దిదారుడితో ప్రధాని మోడీ చమత్కారం
ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పథకం లబ్ధిదారులతో మోడీ వర్చువల్‌గా సంభాషించారు.

దిశ, నేషనల్ బ్యూరో: సూక్ష్మ, చిన్న వ్యాపారులకు ఆర్థిక భరోసాఇచ్చే ప్రధాన మంత్రి ముద్ర యోజన ( PMMY ) పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) మంగళవారం ఆ పథకం లబ్ధిదారులతో వర్చువల్‌గా సంభాషించారు. ఈ సందర్భంగా ఓ లబ్దిదారుడితో మోడీ సరదాగా చమత్కరించారు. కేరళకు చెందిన ఓ వ్యక్తి పథకం కింద రుణం తీసుకుని తన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్న విధానానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నా. ఈ క్రమంలోనే మోడీ ఆ వ్యక్తి సంభాషణలో కలుగ జేసుకుని నెలకు ఎంత సంపాదిస్తున్నావని అడిగాడు. దీంతో ఆయన కొద్ది సేపు మాట్లాడకుండా ఆగిపోయాడు. ఈ క్రమంలోనే స్పందించిన మోడీ.. ‘భయపడకు ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఏమీ నీ దగ్గరకు రారు’ అని అన్నారు. దీంతో లబ్దిదారుల్లో ఒక్క సారిగా నవ్వులు పూయించింది. అనంతరం నెలకు రూ.2.5 లక్షలు సంపాదిస్తున్నట్టు ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ముద్ర యోజన కింద ఇప్పటి వరకు రూ.33 లక్షల కోట్లకు పైగా పూచీకత్తు లేని రుణాలు మంజూరు చేయబడ్డాయని, అనేక మంది తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఉపయోగపడిందని తెలిపారు. ముద్రా లబ్ధిదారుల్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారు ఉన్నారని, అలాగే 70 శాతం కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు మహిళలు కావడం ఎంతో గర్వించదగ్గ విషయమని కొనియాడారు.






