Pm modi: నక్సలిజాన్ని కాంగ్రెస్ ప్రోత్సహించింది.. ప్రధాని మోడీ

by B.Srinivas |

ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నక్సలిజాన్ని ప్రోత్సహించిదని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.

Pm modi: నక్సలిజాన్ని కాంగ్రెస్ ప్రోత్సహించింది.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్ (Chathisgarh) సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress party) నక్సలిజాన్ని ప్రోత్సహించిదని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) ఆరోపించారు. కాంగ్రెస్ విధానాల వల్లే దశాబ్దాలుగా నక్సలిజం పెరిగిపోయిందన్నారు. ఆదివారం ఛత్తీస్ గఢ్‌లో పర్యటించిన మోడీ బిలాస్‌పూర్ (Bhilaspur) జిల్లాలోని మోహభట్టా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంటుందని, త్వరలోనే అక్కడ నూతన శకం ప్రారంభమవుతుందని తెలిపారు. ‘అభివృద్ధిలో ఏ ప్రాంతం వెనుకబడిందో, అక్కడ నక్సలిజం వృద్ధి చెందింది. కానీ 60 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ ఏమి చేసింది? అటువంటి జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించి దాని బాధ్యత నుంచి తప్పుకుంది’ అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద గిరిజనులను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితి వేగంగా మారుతోందని నొక్కి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ ప్రయత్నాల కారణంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో శాంతియుతమైన కొత్త యుగం కనిపిస్తోందని తెలిపారు. బీజేపీ ప్రజలకు ఇళ్ళు నిర్మించడమే కాకుండా నివాసితుల జీవితాలను సుసంపన్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు లక్షలాది మందికి పక్కా ఇళ్లు కావాలనే కలలు కాగితాలకే పరిమితమయ్యాయని వివరించారు. కానీ తమ ప్రభుత్వం ఆ కలను నెరవేర్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చినందున ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోందన్నారు.

Next Story