- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi: నా స్నేహితుడు ట్రంప్ ని కలిసేందుకు ఎదురు చూస్తున్నా- మోడీ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఆయనతో భేటీ కానున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఆయనతో భేటీ కానున్నారు. మోడీ అమెరికా (USA) పర్యటనలో భాగంగా ట్రంప్ తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ చేపట్టనున్నారు. ఈ పర్యటన వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో అందిన సహకారం గురించి మోడీ మాట్లాడారు. ‘‘అమెరికా పర్యటనలో భాగంగా నా స్నేహితుడు ట్రంప్‌ను కలిసేందుకు ఎదురుచూస్తున్నాను. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం.. భారత్‌తో వ్యూహ్యాత్మక భాగస్వామ్య బలోపేతానికి సహకరించింది. ఇప్పుడు దాన్ని కొనసాగించే అవకాశం దొరికింది. సాంకేతిక, రక్షణ, వాణిజ్యం ఇతర రంగాల్లోనూ భారత్-అమెరికా బంధం మరింత దృఢంగా ఉంటుందని ఆశిస్తున్నా. ఈ భేటీ వల్ల ఇరుదేశాలకే కాకుండా ప్రపంచ అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నా’’ అని మోడీ అన్నారు.
మూడ్రోజుల విదేశీ పర్యటన
ఇకపోతే, ప్రధాని సోమవారం నుంచి మూడ్రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉండనున్నారు. ఈనెల 10 నుంచి 12 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (Emmanuel Macron)తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఆతర్వాత ఈనెల 12వ తేదీ సాయంత్రం అమెరికాకు వెళ్లనున్నారు. మరోవైపు, అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు తర్వాత ప్రధాని తొలిసారి అమెరికా పర్యటనను చేపట్టారు. అయితే, ఇటీవలే 104 మంది అక్రమవలసదారులను అమెరికా నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తో ఆ విషయంపైనా మోడీ చర్చించే అవకాశం ఉంది.






