- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు ఫిబ్రవరిలో!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు ఫిబ్రవరిలో విడుదల కానున్నట్టు సమాచారం

దిశ, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకానికి సంబంధించిన 22వ విడత నిధులు ఫిబ్రవరిలో విడుదల కానున్నట్టు సమాచారం. 2026 సంవత్సరానికి చెందిన మొదటి విడత నిధులు వచ్చే నెలలో అర్హులైన రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద అర్హులైన రైతులకు మొత్తం సంవత్సరానికి మూడు దఫాలుగా రూ.6,000 అందిస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు.
అయితే ఈ పథకానికి అర్హత పొందాలంటే e-KYC తప్పనిసరిగా పూర్తి చేయాలి. అలాగే యూనిక్ ఫార్మర్ ఐడీ, సరైన బ్యాంక్ వివరాలు, భూమి రికార్డులు అప్‌డేట్ అయి ఉండాలి. రైతులు తాము అర్హులో కాదో లేదో తెలుసుకోవాలంటే pmkisan.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ద్వారా బెనిఫిషరీ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.






