ప్లాన్డ్‌.. ట్రెయిన్డ్‌.. ఎగ్జిక్యూటెడ్‌.. భారత ఆర్మీ మరో వీడియో

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-18 12:16:24  IST  )

కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack) ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)' చేపట్టి పాకిస్థాన్‌లోని (Pakistan) ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

ప్లాన్డ్‌.. ట్రెయిన్డ్‌.. ఎగ్జిక్యూటెడ్‌.. భారత ఆర్మీ మరో వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack) ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)' చేపట్టి పాకిస్థాన్‌లోని (Pakistan) ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్ డ్రోన్ దాడులకు పాల్పడగా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవటం మాత్రమే కాకుండా.. పూర్తి స్వదేశీ ఆయుధాలతో పాకిస్థాన్‌లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశామని భారత్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను కూడా భారత సైన్యం ఇప్పటికే సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తాజాగా మరో కీలక వీడియోను పంచుకుంది.

ఈ వీడియోలో పాక్‌లోని ఉగ్రస్థావరాలపై కచ్చితత్వంతో దాడులు చేయడానికి భారత సైన్యం ఎలా ప్రణాళికలు రచించింది, సైనికులకు ఏ విధంగా శిక్షణనిచ్చి దాడులను అమలు చేసిందనే విషయాన్ని 'ప్లాన్డ్‌.. ట్రెయిన్డ్‌.. ఎగ్జిక్యూటెడ్‌' అనే క్యాపన్ష్‌తో ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ అధికారులు వీడియోను విడుదల చేశారు. ఆపరేషన్ సింధూర్.. పాకిస్తాన్‌ తరతరాలు గుర్తించుకునేలా ఒక గుణపాఠం అని భారత సైన్యం పేర్కొంది. ఇది ప్రతీకార చర్య కాదని బాధిత కుటుంబాలకు సైన్యం చేసిన న్యాయం అని వీడియోలో సైనికులు పేర్కొన్నారు. ఇక తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా తమ చర్య ఎంత కఠినంగా ఉంటుందో పాకిస్థాన్‌కు మరోసారి స్పష్టం చేసినట్టయింది.

Click For Tweet..

Next Story