విమానం కూలినప్పుడు సమీపంలో నేను ఉన్నా: ఎమ్మెల్యే దర్శణ వాఘేలా

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-12 12:07:27  IST  )

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో మెడికల్ కాలేజీపై విమానం కుప్పకూలింది....

విమానం కూలినప్పుడు సమీపంలో నేను ఉన్నా: ఎమ్మెల్యే దర్శణ వాఘేలా
X

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు(Ahmedabad Airport) సమీపంలో మెడికల్ కాలేజీ(Medical College)పై విమానం కుప్పకూలింది. ఈ సమయంలో 243 మంది ప్రయాణికులు ఫ్లైట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో సమీప ప్రాంతంలో ఎమ్మెల్యే దర్శణ వాఘేలా(MLA Darshana Vaghela) కార్యాలయం ఉంది. అంతేకాదు ఆ కార్యాలయంలో ఆమె ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అసలు ఏం జరిగిందనేది ఆమె మీడియాకు వివరించారు. ‘‘విమానం కూలిపోయినప్పుడు నేను సమీపంలోని నా కార్యాలయంలో ఉన్నా. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. వైద్యుల ఫ్లాట్లు దెబ్బతిన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతాయి. ఈ ఘటన బాధాకరం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. ’’ అని ఎమ్మెల్యే దర్శణ వాఘేలా తెలిపారు.

Next Story