Ahmedabad Plane Crash : మెడికల్ కాలేజీపై కూలిన విమానం.. 20 మందికి పైగా మెడికోలు మృతి

by Muthe.Rajitha |   (  Updated:2025-06-12 11:03:27  IST  )

అహ్మదాబాద్(Ahmedabad) ఎయిర్పోర్టు(Meghani Gujsel Airport) సమీపంలో గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం(Air India Flight Crash) కుప్పకూలింది.

Ahmedabad Plane Crash : మెడికల్ కాలేజీపై కూలిన విమానం.. 20 మందికి పైగా మెడికోలు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్(Ahmedabad) ఎయిర్పోర్టు(Meghani Gujsel Airport) సమీపంలో గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం(Air India Flight Crash) కుప్పకూలింది. మధ్యాహ్నం 1.39 సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ టైమ్‌లో ఒక్కసారిగా సివిల్‌ ఆసుపత్రి సమీపంలోని బీజె మెడికల్ కాలేజీ(BJ Medical College) బిల్డింగ్, జనావాసాలపై ఫ్లైట్ క్రాష్ అయింది. ఈ ఘటనలో మెడికల్ కాలేజ్ బిల్డింగ్ తోసహ రెండు భారీ భవనాలకు మంటలు అంటుకున్నాయి. కాగా ఈ ఘటనలో 20 మందికి పైగా మెడీకోలు(Medical Students) అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం.

మధ్యాహ్న సమయం కావడంతో పెద్ద ఎత్తున పీజీ స్టూడెంట్స్ భోజనానికి రాగా.. ఆ సమయంలోనే ఒక్కసారిగా ఫ్లైట్ బిల్డింగ్ పై కూలిపోయింది. ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Former CM Vijay Rupani)తోపాటు 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించి ఉంటారని తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story