- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా పెరగబోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
దేశంలోని వాహనదారులకు త్వరలో ఇంధన సెగ తగిలే అవకాశం కనిపిస్తోంది. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును తోసిపుచ్చలేమని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని వాహనదారులకు త్వరలో ఇంధన సెగ తగిలే అవకాశం కనిపిస్తోంది. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును తోసిపుచ్చలేమని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా లేకపోవడం ప్రభుత్వానికి, చమురు కంపెనీలకు భారంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి ధరలను సవరించక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతానికి ధరల విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఎదుర్కొంటున్న నష్టాలను తగ్గించాలంటే ధరల పెంపు ఒకటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల తర్వాతే మార్పులు..?
సాధారణంగా ఎన్నికల సమయంలో ధరల పెంపు ఉండదు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధరలను అదుపులో ఉంచడం కష్టమవుతుందని, అందుకే సమీప భవిష్యత్తులో ధరల సవరణ అనివార్యం కావచ్చని ప్రభుత్వ ప్రతినిధులు సూచాయగా తెలిపారు.






