- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: ప్రజలపై ‘డబుల్’ అటాక్ జరుగుతోంది- కేంద్రంపై జైరాం రమేశ్ విమర్శలు
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రజలపై డబుల్ అటాయ్ జరుగుతోందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

దిశ, నేషనల్ బ్యూరో: నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రజలపై డబుల్ అటాయ్ జరుగుతోందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఓ వైపు ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, మరోవైపు పెరుగుతున్న పన్నులతో ప్రజలపై డబుల్ అటాయ్ జరుగుతోందని మండిపడింది. ప్రజలు పన్నుల ద్వంద దాడి ఎదుర్కొంటున్నాయని నిప్పులు చెరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ప్రజలు ఎలా తట్టుకుంటారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. "స్వయంగా ప్రకటిత డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో భారతదేశ ప్రజలు ఆకాశాన్ని అంటుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న పన్నుల డబుల్ దాడిని ఎదుర్కొంటున్నారు. గత 10 సంవత్సరాలలో ద్రవ్యోల్బణం, పన్నుల భారాలు నిరంతరం పెరిగాయి" అని జైరాం రమేశ్ అన్నారు.
వైద్యం, విద్యపై ఖర్చు..
వైద్యం, విద్యపై ఖర్చు ప్రతి సంవత్సరం 12-15 శాతం పెరిగిందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. "పాఠశాల ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు - ప్రతిదీ ఖరీదైనవిగా మారాయి. బ్యాంకులు చిన్న సేవలకు కూడా రుసుములు వసూలు చేస్తున్నాయి. కారు, నెట్ బ్యాంకింగ్, పాలు, పెరుగు, పిండి వంటి ముఖ్యమైన వస్తువులపై జీఎస్టీ ఉంది " అని ఆయన అన్నారు. ఆదాయాలు పెరగలేదు కానీ పన్నులు, ఖర్చులు మాత్రం ప్రజల నడ్డి విరగొట్టాయన్నారు. సామాన్య ప్రజలు ఈ పన్ను దోపిడీ, ద్రవ్యోల్బణాన్ని ఎలా తట్టుకుంటారో మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధరలు పెరగడం, తగ్గుతున్న ప్రైవేట్ పెట్టుబడులు, వేతనాల్లో పెంపు లేకపోవడం వల్ల సామాన్య ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.






