Mayawati: పార్టీ శ్రేణులు ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు- బీఎస్పీ అధినేత్రి మాయావతి

by Shamantha N |

బహుజన్ సమాజ్ పార్టీ(Bahujan Samaj Party) శ్రేణులు ఎవరినైనా వివాహం చేసుకోవచ్చని ఆ పార్టీ అధినేత్రి మాయావతి(Mayawati) అన్నారు.

Mayawati: పార్టీ శ్రేణులు ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు- బీఎస్పీ అధినేత్రి మాయావతి
X

దిశ, నేషనల్ బ్యూరో: బహుజన్ సమాజ్ పార్టీ(Bahujan Samaj Party) శ్రేణులు ఎవరినైనా వివాహం చేసుకోవచ్చని ఆ పార్టీ అధినేత్రి మాయావతి(Mayawati) అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ శాసనసభ్యుని కుమార్తెతో తన కుమారుడి వివాహం జరిపించిన బీఎస్పీ నాయకుడిని సస్పెండ్ చేసినట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తమ పార్టీ సభ్యులు ఏ పార్టీకి చెందిన వారినైనా వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉందని, వక్తిగత నిర్ణయాలపై పార్టీ ప్రభావం ఉండవద్దని అన్నారు. “పార్టీ కేడర్ వ్యక్తిగత సంబంధాల గురించి పట్టించుకోదు. ప్రజలు ఎవరినైనా వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నారు. ఇదంతా వారి ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. అయితే దీని గురించి తప్పుడు ప్రచారం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి' అని ఆమె అన్నారు.

సురేంద్ర సాగర్ సస్పెన్షన్

బీఎస్పీ రాంపూర్ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర సాగర్ ఇటీవలే అంబేద్కర్ నగర్‌లోని అలపూర్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే త్రిభువన్ దత్ కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఒకప్పుడు బీఎస్పీలో ఉన్న దత్ 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్పీలో చేరారు. ఇకపోతే, సురేంద్ర సాగర్ ను పార్టీ నుంచి మాయావతి బహిష్కరించారు. దీంతో, ఎస్పీ ఎమ్మెల్యే కుమార్తెతో వివాహం చేసుకున్నందుకే పార్టీ నుంచి బహిష్కరించినట్లు వార్తలొచ్చాయి. కాగా.. ఆ వార్తలను మాయావతి ఖండించారు. సురేంద్ర సాగర్, ప్రమోద్ కుమార్ మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుందని ఆమె వెల్లడించారు. దీంతో, పార్టీ పనితీరు దెబ్బతింటుందని.. అందుకే వారిద్దరినీ బహిష్కరించినట్లు స్పష్టం చేశారు.

Next Story