- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Paswan: నితీశ్ ప్రభుత్వానికి మద్దతివ్వడం బాధగా ఉంది.. ఎల్‌జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్
బిహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి (రాంవిలాస్) చీఫ్, చిరాగ్ పాశ్వాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి (రాంవిలాస్) చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) రాష్ట్ర ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నేరస్థులకు పరిపాలనా విభాగం పూర్తిగా లొంగిపోయిందని, హత్య, దోపిడీ, కిడ్నాప్, లైంగిక దాడిఘటనలు నిరంతరం జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ టైంలో ప్రభుత్వానికి మద్దతిస్తున్నందుకు బాధగా ఉందన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బిహార్ సురక్షితంగా లేదని, నేరాలు ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం పరిస్థితిని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు.
ప్రభుత్వం సకాలంలో మేల్కొనాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తాను కేంద్ర రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండబోనని, ఎల్లప్పుడూ బిహార్ ప్రజల కోసమే పోరాడతానని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా బిహార్‌ను చూడాలనుకుంటున్నానని తెలిపారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.






