పాకిస్తాన్ వక్రబుద్ధి.. మరోసారి సీజ్‌ఫైర్ ఉల్లంఘన

by Gantepaka Srikanth |

పాకిస్తాన్ వక్రబుద్ధి.. మరోసారి సీజ్‌ఫైర్ ఉల్లంఘన

పాకిస్తాన్ వక్రబుద్ధి.. మరోసారి సీజ్‌ఫైర్ ఉల్లంఘన
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్(Pakistan) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో చేసిన సీజ్‌ఫైర్(Ceasefire) ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో కాల్పులు జరిపింది. సుమారు 15 నిమిషాల పాటు నిరంతరాయంగా కాల్పులు జరిపినట్లు సమాచారం. తక్షణమే అప్రమత్తమైన భారత బలగాలు ధీటుగా బదులిచ్చాయి. అయితే.. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్‌పై పాక్ కాల్పులు జరపడం ఇదే తొలిసారి. అయితే పాక్ వ‌క్ర బుద్ధిపై పెద్ద ఎత్తున విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story