- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థ కాదు.. పహెల్గాం దాడి చేశారని ఆధారాలేవి?
టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థ కాదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. పహెల్గాం దాడి వాళ్లే చేశారని ఆధారాలు చూపించాలని పార్లమెంటులో ఆ దేశ ఉపప్రధాని ఇషాక్ దార్ అడిగారు.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి కారణమైన ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్)కు పాకిస్తాన్ బహిరంగంగా మద్దతిచ్చింది. పాక్ పార్లమెంటులో మాట్లాడిన ఆ దేశ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్.. టీఆర్ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించడాన్ని ఖండించారు. పహెల్గాంగ ఉగ్రదాడిని ఖండిస్తూ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ చేసిన ప్రకటనలో టీఆర్ఎఫ్ పేరు లేకుండా పాకిస్తాన్ అడ్డుకుందని దార్ చెప్పారు.
‘యూఎన్ఎస్‌సీ స్టేట్‌మెంట్‌లో టీఆర్ఎఫ్ పేరు రాకుండా అడ్డుకున్నాం. పలుదేశాల నుంచి మాకు కాల్స్ వచ్చాయి. కానీ మేం తలొగ్గలేదు. చివరకు టీఆర్ఎఫ్‌ను ఆ ప్రకటన నుంచి తొలగించారు. పాక్ గెలిచింది’ అని దార్ వెల్లడించారు. అలాగే తాము టీఆర్ఎఫ్‌ను ఇల్లీగల్‌గా పరిగణించబోమని స్పష్టంచేసిన ఆయన.. ‘పహెల్గాం ఉగ్రదాడి చేసింది టీఆర్ఎఫ్ అని సాక్ష్యాలు చూపించండి. టీఆర్ఎఫ్ యాజమాన్యం ఎవరో చూపించండి. దానిపై వచ్చే ఆరోపణలను మేం అంగీకరించం.
అందుకే యూఎన్ ప్రెస్ రిలీజ్ నుంచి టీఆర్ఎఫ్‌ను తొలగించాలని డిమాండ్ చేశాం’ అని దార్ అన్నారు. పహెల్గాం దాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికితోడు భారత్, యూఎస్ నిఘా వర్గాలు కూడా టీఆర్ఎఫ్ పూర్తిగా లష్కర్-ఎ-తాయిబా అనుబంధ సంస్థ అని గుర్తించాయి. అయినా సరే పాకిస్తాన్ ఇలా బుకాయించడం గమనార్హం.






