- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : ఎల్ఓసీ వెంట మరోసారి పాక్ కవ్వింపులు.. గంటపాటు ఎదురుకాల్పులు
by Naga Rani Yarlagadda |
పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత ఎల్ఓసీ (LOC) వెంట సైలెంట్ గా ఉన్న పాక్ సైన్యం.. తాజాగా కాల్పులు జరిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత ఎల్ఓసీ (LOC) వెంట సైలెంట్ గా ఉన్న పాక్ సైన్యం.. తాజాగా కాల్పులు జరిపింది. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్వారాలోని నౌగామ్ సెక్టార్లో పాక్ సైన్యం కవ్వింపులకు పాల్పడగా.. అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ ఎదురుకాల్పులు జరిపి.. సమర్థవంతంగా తిప్పికొట్టింది. నిన్న (శనివారం) సాయంత్రం 6.15 గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా.. గంటపాటు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎదురుకాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. కాగా.. ఈ కాల్పుల ఘటనపై ఇండియన్ ఆర్మీ (Indian Army) నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Next Story






