రెచ్చగొట్టిన పాకిస్తాన్ సైన్యం.. ఐదుగురిని లేపేసిన ఇండియన్ ఆర్మీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-01 14:13:21  IST  )

భారత సరిహద్దుల్లో అనూహ్య పరిస్థితి చోటుచేసుకున్నది.

రెచ్చగొట్టిన పాకిస్తాన్ సైన్యం.. ఐదుగురిని లేపేసిన ఇండియన్ ఆర్మీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సరిహద్దుల్లో అనూహ్య పరిస్థితి చోటుచేసుకున్నది. జమ్మూ కశ్మీర్‌(Jammu and Kashmir)లోని పూంచ్ సెక్టార్‌లో పాకిస్తాన్(Pakistan) కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఒక్కసారిగా భారత బలగాలపై కాల్పులకు తెగబడింది. వెంటనే అప్రమత్తమైన భారత సైనికులు(Indian Army) ఎదురుకాల్పులకు దిగారు. పాకిస్తాన్ సైన్యం కాల్పులను సమర్థవంగా ఎదుర్కున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు వరుసగా భారత వ్యతిరేక ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని సరిహద్దుల్లో దాడులు చేస్తున్నట్లు వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. తాజాగా కరాచీలో లష్కరే తోయిబా(ఎల్ఈటీ) సంస్థకు ఫైనాన్షియర్‌గా వ్యవహరిస్తున్న ఖాద్రి అబ్దు రెహమాన్‌ను గుర్తుతెలియని వ్యక్తి కాల్చి చంపాడు. ఈ ఘటన పాక్ వాణిజ్య నగరమైన కరాచీలో చోటుచేసుకుంది. రంజాన్ రోజునే జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో ఇది భారత్ అనే భావించిన పాక్.. ఇవాళ కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు భారత సైన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది.

Next Story