- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pakisthan: పాక్ భిక్షాటన చేయాలనుకోవడం లేదు.. ప్రధాని షెహబాజ్ షరీఫ్
పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. పాక్ భిక్షాటన చేయడం మిత్ర దేశాలకు ఇష్టం లేదన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehabaz shareef) అంగీకరించారు. అయితే పాక్ భిక్షాటన చేయడం మిత్ర దేశాలకు ఇష్టం లేదన్నారు. ఆర్థిక సాయం కోరడానికి పాక్ తమ వద్దకు వస్తుందని వారు ఆశించడం లేదని తెలిపారు. బలూచిస్తాన్ ప్రావిన్షియల్ రాజధాని క్వెట్టాలో పాకిస్థాన్ సైనికులను ఉద్దేశించి షరీఫ్ ప్రసంగించారు. చైనా , సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్, యూఏఈలు తమకు విశ్వసనీయమైన మిత్రులని తెలిపారు. ‘పాక్ మిత్ర దేశాలు వాణిజ్యం, ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, పెట్టుబడులు లాభదాయకమైన వెంచర్లలో పరస్పరం పాల్గొనాలని ఆశిస్తున్నాయి. మనం భిక్షాటన పాత్రతో వారి వద్దకు వెళ్లాలని ఆశించడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి సహజ, మానవ వనరులను పూర్తిగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు.






