టీఆర్ఎఫ్ పేరు మార్చే ప్రయత్నాలు? విమర్శలు తప్పించుకునేందుకు పాక్ ట్యాక్టిక్!

by Phanindra |

టీఆర్ఎఫ్ పేరు మార్చి కొత్తగా లాంచ్ చేసేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా విమర్శలు తప్పించుకునేందుకు ఈ ట్యాక్టిక్ వాడనుంది?

టీఆర్ఎఫ్ పేరు మార్చే ప్రయత్నాలు? విమర్శలు తప్పించుకునేందుకు పాక్ ట్యాక్టిక్!
X

దిశ, నేషనల్ బ్యూరో: లష్కర్-ఎ-తాయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్)ను ఉగ్రవాద సంస్థగా యూఎస్ గుర్తించింది. దీంతో దీని పేరు మార్చి, మళ్లీ తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు పాక్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ రీబ్రాండింగ్ ప్రక్రియ జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై భారత నిఘా వర్గాలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా విమర్శల నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి మార్గాలు ఉపయోగిస్తారని నిపుణులు చెప్తున్నారు.

ఈ క్రమంలోనే టీఆర్ఎఫ్ పేరు మార్చి, యధావిధిగా తమ ప్రాక్సీ వార్‌ కొనసాగించేందుకు పాక్ ప్రయత్నిస్తుందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే పాక్ చేసే ప్రయత్నాలను ఎండగట్టేందుకు ఆధారాలు సేకరించేందుకు భారత నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఆధారాలు లభిస్తే వీటిని యూఎస్‌తోపాటు యాంటీ టెర్రర్ వాచ్‌డాగ్ ఎఫ్ఏటీఎఫ్‌కు అందజేయాలని భారత్ భావిస్తోంది.

Next Story