బార్డర్ దాటిన ప్రేమ కథ.. ఎన్నో ఆశలతో పాక్ నుంచి ఇండియాకు.. కానీ ఆలోపే విషాదంతం...

by Sujitha Rachapalli |

పాకిస్తాన్‌కు చెందిన రవి కుమార్(17), శాంతి బాయి(15) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కి జిల్లాలోని మీర్పూర్ మథేలోలో వివాహం జరిగింది. అయితే హిందూ సమాజానికి చెందిన వారిగా మతపరమైన వివక్ష నుంచి తప్పించుకోవడానికి,

బార్డర్ దాటిన ప్రేమ కథ.. ఎన్నో ఆశలతో పాక్ నుంచి ఇండియాకు.. కానీ ఆలోపే విషాదంతం...
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌కు చెందిన రవి కుమార్(17), శాంతి బాయి(15) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కి జిల్లాలోని మీర్పూర్ మథేలోలో వివాహం జరిగింది. అయితే హిందూ సమాజానికి చెందిన వారిగా మతపరమైన వివక్ష నుంచి తప్పించుకోవడానికి, భారతదేశంలో మెరుగైన జీవితాన్ని గడిపేందుకు వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. కానీ పహెల్గాం ఎటాక్, ఆపరేషన్ సిందూర్ ఘటనలతో భారత్-పాకిస్తాన్ సంబంధాలు దెబ్బతినడంతో వారి దరఖాస్తు తిరస్కరించబడింది. కుమార్ తండ్రి హెచ్చరికలను ధిక్కరించి ఈ జంట జూన్ 21న రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో అక్రమంగా అంతర్జాతీయ సరిహద్దును దాటారు. ఇక అంతా శుభమే జరుగుతుందన్న టైమ్‌లోనే విషాదంతో అంతమైంది.

థార్ ఎడారిలో తప్పిపోయిన వారు దాహంతో, నీరు దొరకక మరణించారు. జూన్ 28న స్థానిక కాపరి వారి మృతదేహాలను గుర్తించాడు. కుమార్ ముఖం సమీపంలో నీళ్లు లేని ఖాళీ క్యాన్ ఉండటం చివరి క్షణంలో ప్రాణాలు నిలుపుకునేందుకు వారు అల్లాడిపోయిన పరిస్థితిని సూచిస్తుంది. వారి వద్ద ఉన్న పాకిస్తాన్ జాతీయ గుర్తింపు కార్డులు భారత అధికారులలో భద్రతా ఆందోళనలను రేకెత్తించాయి. ఇది చొరబాటు అనుమానాలపై దర్యాప్తును ప్రేరేపించింది. పోస్ట్‌మార్టం నీటి లేమి కారణంగా మరణం సంభవించినట్లు నిర్ధారించింది. మృతదేహాలు స్వదేశానికి తిరిగి రాకపోతే.. జైసల్మేర్‌లోని బంధువులు హిందూ ఆచారాల ప్రకారం వారి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ హృదయవిదారక కథ అక్రమ సరిహద్దు దాటడాల ప్రమాదాలను, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అటువంటి నిర్ణయాలకు కారణమైన నిరాశను హైలైట్ చేస్తుంది.

LINK

Next Story