- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌ను టార్గెట్ చేసేందుకు ‘పాక్ రాకెట్ ఫోర్స్’
భారత్‌ను టార్గెట్ చేసేందుకు పాకిస్తాన్ ప్రత్యేకంగా ఆర్మీలో ‘రాకెట్ ఫోర్స్’ ఏర్పాటు చేసింది. చైనా నుంచి ఈ అంశాన్ని కాపీ కొట్టింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ సమయంలో దారుణంగా మట్టికరచిన పాకిస్తాన్.. కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఆర్మీలో మిసైల్స్‌ను హ్యాండిల్ చేసేందుకు ప్రత్యేకంగా ‘రాకెట్ ఫోర్స్’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చైనా ఆర్మీలో కూడా ప్రత్యేకంగా మిసైల్స్‌ను హ్యాండిల్ చేసేందుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ (పీఎల్ఏఆర్ఎఫ్) అనే మిలిటరీ కమాండ్ ఉంది. దీన్నే పాకిస్తాన్ కూడా కాపీ కొట్టినట్లు కనిపిస్తోంది. ఈ కొత్త ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ (ఏఆర్ఎఫ్‌సీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ కమాండ్ గ్రూప్‌ను అత్యాధునిక టెక్నాలజీతో నింపుతామని షరీఫ్ తెలిపినట్లు సమాచారం. అయితే పూర్తిగా భారత్ కోసమే దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పాక్ ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి.
Next Story






