Pahalgam Attack: ప్రాంతీయ ఘర్షణలకు దారితీయని విధంగా స్పందన ఉండాలి

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడి తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి విషయంలో భారత్‌ (India) ప్రతిస్పందన ప్రాంతీయ ఘర్షణలకు దారితీయకుండా ఉండాలని కోరారు.

Pahalgam Attack: ప్రాంతీయ ఘర్షణలకు దారితీయని విధంగా స్పందన ఉండాలి
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి విషయంలో భారత్‌ (India) ప్రతిస్పందన ప్రాంతీయ ఘర్షణలకు దారితీయకుండా ఉండాలని కోరారు. ఉగ్రవేటలోభారత్ కు పాకిస్థాన్ సహకరించాలని కోరారు. ‘‘పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి (Pahalgam Terror Attack) పాల్పడటం దారుణం. అయితే, దీనికి భారత్‌ ప్రతిస్పందించడం సరైనదే. కానీ, అది విస్తృత ప్రాంతీయ ఘర్షణలకు దారితీయనివిధంగా ఉంటుందని మేం విశ్వసిస్తున్నాం. ఇక, పాకిస్థాన్‌ కూడా ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆశిస్తున్నాం. కొన్నిసార్లు పాక్‌ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు వారు సహకరించాలి’’ అని జేడీ వాన్స్‌ ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

జేడీ వాన్స్ భారత్ పర్యటనలో ఉన్నప్పుడే..

ఇకపోతే, కుటుంబంతో కలిసి జేడీ వాన్స్‌ భారత పర్యటనలో ఉన్న సమయంలోనే పహెల్గాం ఉగ్రదాడి జరిగింది. కాగా.. ఆ దాడిని వాన్స్‌ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ చేసే పోరాటంలో అమెరికా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన భరోసానిచ్చారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా పలు అగ్రరాజ్య నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ భారత్‌కు మద్దతుగా నిలిచారు. ఏప్రిల్‌ 22న పహెల్గాంలోని బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story