- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ADB:పాకిస్థాన్ కు ఏడీబీ రుణం..తీవ్రంగా వ్యతిరేకించిన భారత్
పొరుగుదేశం పాకిస్థాన్‌కు అంతర్జాతీయ సంస్థలు ఏ రూపంలోనైనా సాయం అందించడంపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.

దిశ, నేషనల్ బ్యూరో: పొరుగుదేశం పాకిస్థాన్‌కు అంతర్జాతీయ సంస్థలు ఏ రూపంలోనైనా సాయం అందించడంపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి సమయంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు(ADB) 800 మిలియన్ డాలర్ల(సుమారు 68 వేల కోట్లు) బెయిల్ అవుట్ ప్యాకేజీని ఆమోదించింది. కాగా.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,500 కోట్లు) ప్యాకేజీని పొందిన నెల తర్వాత ఈ పరిణామం జరిగింది. ప్రజా ఆర్థిక నిర్వహణను మెరుగుపరచడానికి ఆమోదించబడిన ప్యాకేజీలో 300 మిలియన్ డాలర్లు విధాన ఆధారిత రుణం, 500 మిలియన్ డాలర్లు ప్రోగ్రామ్ ఆధారిత హామీలు ఉన్నాయి. అయితే, పాకిస్థాన్‌కు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ఆర్థిక సాయం అందిస్తుండటాన్ని భారత్ మరోసారి తీవ్రంగా వ్యతిరేకించింది. ఏడీబీ నుంచి రుణంగా పొందే నిధులను పాక్ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆరోపించింది. ఆ నిధులతో పాకిస్థాన్ సైనిక వ్యయాలు చేసే ముప్పు ఉందని భారత్ పేర్కొంది. దేశంలో ఆర్థిక సంస్కరణలు చేస్తామని గతంలో ఏడీబీకి ఇచ్చిన హామీలను పాక్ ఎంతమేరకు నెరవేర్చిందని నిలదీసింది. ఈమేరకు పాక్‌పై తమకు ఉన్న ఆందోళనలను ఏడీబీ ఉన్నతాధికారులకు తెలియజేశామని భారత అధికార వర్గాలు వెల్లడించాయి.
స్పందించని ఏడీబీ
అయితే, పాక్‌కు రుణాలపై భారత్ వ్యక్తం చేసిన ఈ ఆందోళనలపై ఇప్పటి వరకైతే ఏడీబీ స్పందించలేదు. భారత్ లేవనెత్తిన ఈ అభ్యంతరాలు తదుపరి దశల్లో మరిన్ని రుణాల సమీకరణకు పాక్ చేసే ప్రయత్నాలకు ఆటంకాల్లా ఎదురునిలిచే అవకాశం ఉంది. ఇక, ఆసియా అభివృద్ధి బ్యాంకు పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం అందించడంపై భారతదేశం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. 2018లో పాకిస్తాన్ జీడీపీలో 13 శాతంగా ఉన్న పన్ను ఆదాయం 2023లో కేవలం 9.2 శాతానికి గణనీయంగా తగ్గడంతో పాటు దాని రక్షణ వ్యయం పెరగడంతో పాక్ ఆర్థిక దుర్బలత్వానికి పాల్పడుతుందని భారత్ ఆరోపించింది. ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఇతర అంతర్జాతీయ రుణదాతల నుంచి వచ్చే నిధులు అభివృద్ధికి బదులుగా సైనిక ఖర్చులకు పాక్ మళ్లిస్తుందని భారత్ పేర్కొంది. 2018 నుంచి 2023 మధ్యకాలంలో పాకిస్థాన్ ప్రభుత్వ రెవెన్యూ(రాబడి) తగ్గిపోగా, రక్షణరంగ వ్యయం పెరిగిపోయింది. సైనిక అవసరాలకు పాక్ వినియోగిస్తున్న నిధులు దేశీయంగా, అంతర్గతంగా సమకూర్చుకున్నవేం కాదని భారత అధికార వర్గాలు ఏడీబీ ఉన్నతాధికారులకు వివరించాయి. అంతేకాకుండా, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి పాకిస్థాన్ పాలసీ బేస్డ్ రుణాలను తీసుకుంటోందని.. వాటిని సైనిక అవసరాలకు దారి మళ్లిస్తోందని భారత్ పేర్కొంటుంది. అలా జరగకుండా ఏడీబీ మేనేజ్‌మెంట్ చర్యలు చేపట్టాలని కోరింది. రుణ నిధులను పాక్ ఎందుకు తీసుకుందో, అందుకు మాత్రమే వాడేలా పర్యవేక్షించాలని ఏడీబీకి భారత ప్రభుత్వ వర్గాలు సూచించాయి.






