- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతీయులను కాపాడిన పాకిస్తాన్ అధికారికి అరుదైన గౌరవం.. అది ఏంటంటే
Haj: గత ఏడాది హజ్(Haj) యాత్రలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తీవ్ర ఇబ్బందులు కలగడంతో దాదాపు 1300 మంది మరణించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: Haj: గత ఏడాది హజ్(Haj) యాత్రలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తీవ్ర ఇబ్బందులు కలగడంతో దాదాపు 1300 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రాణాలకు తెగించి ఎందరో యాత్రికులను కాపాడిన పాకిస్తాన్ కు చెందిన అధికారి ఆసిఫ్ బషీర్ కు ఆ దేశం మూడో అత్యున్న పౌర పురస్కారం సితారే ఇంతియాజ్ ప్రదానం చేసింది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ(Asif Ali Zardari) ఈ అవార్డు ఆ అధికారికి బహూకరించారు.
గత ఏడాది నిర్వహించిన హజ్ యాత్ర(Hajj pilgrimage) కు ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది యాత్రికులు హాజరయ్యారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలుల కారణంగా వారిలో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. 1300 మందికి పైగా మరణించినట్లు సౌదీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ సమయంలో ఆసిఫ్ బషీర్(Asif Bashir)..మీనాలో హజ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన పలువురు యాత్రికులను ఆయన తన సిబ్బందితో కలిసి ప్రథమ చికిత్సను అందించారు. 17 మంది భారతీయులు సహా 26 మందికి ఆయనతోపాటు వారి సిబ్బంది భుజాలపై ఎత్తుకుని ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడారు. దీనికి గాను పాకిస్తాన్ మూడో అత్యున్నత పౌర పురస్కారా(Highest civilian award)న్ని బహూకరించారు.






