- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Padma Awards : రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పద్మశ్రీ అందుకున్న మందకృష్ణ మాదిగ
పద్మ అవార్డుల(Padma Awards) రెండవ విడత ప్రదానోత్సవం ఢిల్లీ(Delhi)లోని రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : పద్మ అవార్డుల(Padma Awards) రెండవ విడత ప్రదానోత్సవం ఢిల్లీ(Delhi)లోని రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటి, భరతనాట్య కళాకారిణి శోభన చంద్రకుమార్(Actor Shobhana Chandrakumar)కు పద్మభూషణ్(PadmaBhushan) అవార్డు, సామాజిక కార్యకర్త, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) పద్మశ్రీ(PadmaSri) అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) చేతుల మీదుగా స్వీకరించారు.
శోభన.. మలయాళ సినిమా నటి, భరతనాట్య నృత్యకారిణిగా 40 ఏళ్లకు పైగా సినిమా, నృత్య రంగాల్లో చేసిన కృషికి గాను పద్మభూషణ్ అందుకున్నారు. ఆమె 80కి పైగా సినిమాల్లో నటించి.. రెండు జాతీయ అవార్డులు, అనేక రాష్ట్ర అవార్డులు గెలుచుకున్నారు. మందకృష్ణ మాదిగ.. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS) వ్యవస్థాపకుడిగా, దళితుల హక్కుల కోసం, మాదిగ సామాజిక వర్గం ఉద్యమానికి చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు పొందారు.
2025 పద్మ అవార్డుల్లో మొత్తం 139 మందికి అవార్డులు అందించారు. అందులో 7 మందికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25, 2025న ఈ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.






