పార్లమెంట్‌ ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళన.. సీఈసీపై అభిశంసనకు ప్లాన్!

by Kema Shiva Kumar |

‘ఓట్ల చోరీ’ అంశం ఉభయ సభలను అట్టుడికిస్తోంది. ఇవాళ ఉదయం పార్లమెంట్ (Parliament) ఆవరణలో విపక్షాలు ఆందోళనకు దిగాయి

పార్లమెంట్‌ ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళన.. సీఈసీపై అభిశంసనకు ప్లాన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఓట్ల చోరీ’ అంశం ఉభయ సభలను అట్టుడికిస్తోంది. ఇవాళ ఉదయం పార్లమెంట్ (Parliament) ఆవరణలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. బిహార్‌ (Bihar)లో ఓట్ల జాబితా సవరణకు వారు కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్డీఏ (NDA) సర్కార్ ఓట్ల చోరీకి పాల్పడిందంటూ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) వెంటనే రాజీనామా చేయాలని విపక్ష ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ కామెంట్ చేసిన తరుణంలో ఆయనపై అభిశంసనకు విపక్షాలు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

కాగా, ఓట్ల చోరీ జరిగిందంటూ పదేపదే ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అందుకు తగిన తగ్గ ఆధారాలు సమర్పించాలని, లేని పక్షంలో క్షమాపణ చెప్పాలని భారత ఎన్నికల సంఘం (ECI) కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ డిమాండ్‌ చేశారు. రాహుల్ గాంధీ వద్ద ఎవిడెన్స్ ఉంటే ఆధారాలుంటే వారంలోపు ప్రమాణ పత్రం రూపంలో సైన్ చేసి సమర్పించాలని అల్టిమేటం జారీ చేశారు. అలా చేయని పక్షంలో ఆరోపణలు అన్నీ నిరాధారంగా పరిగణిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తేల్చి చెప్పారు. ఈసీ భుజాన తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేసేవారి ఆటలు సాగవని కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఓటర్లపై నకిలీలనే ముద్రవేసే ఎత్తులను తాము అంగీకరించబోమని అన్నారు.

Next Story