- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సిందూర్‌పై చర్చ రోజునే.. ఉగ్రవాదుల ఎన్కౌంటర్.. ప్లానా? యాదృచ్ఛికమా?
ఆపరేషన్ సిందూర్.. భారత మహిళల భర్తలే టార్గెట్‌గా పహల్గామ్‌లో టూరిస్టులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) 26 మందిని పొట్టన పెట్టుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్.. భారత మహిళల భర్తలే టార్గెట్‌గా పహల్గామ్‌లో టూరిస్టులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. అందుకు ప్రతీకారంగా మే 6-7 తేదీల్లో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో (POK) ఉన్న ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వాటిని నేలమట్టం చేసి ప్రతీకారం తీర్చుకుంది. దీనిపై నేడు (సోమవారం) పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఈ సమయంలోనే జమ్మూ కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ జరిగింది.
ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ మహదేవ్ (Operation Mahadev) పేరుతో జమ్ముకశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ (Indian Army), సీఆర్పీఎఫ్ కలిసి ఆపరేషన్ చేపట్టాయి. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు.. నెలరోజులుగా ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. సోమవారం ఉదయం దాచిగమ్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరుపగా.. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులు మరణించగా.. వారు పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరుగుతున్న వేళ.. ఆపరేషన్ మహదేవ్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వడం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అన్న చర్చ మొదలైంది. మోడీ ఏం చేసినా దాని వెనుక ఒక అర్థం ఉంటుందని అందరికీ తెలిసిందే.. ఆపరేషన్ సిందూర్ చేపట్టినపుడు కూడా ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా పని కానిచ్చేశాక ప్రకటన చేశారు. అప్పటి వరకూ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ఉంటాయని ప్రచారం చేశారు. దీంతో ప్రపంచమంతా ఇండియాలో మాక్ డ్రిల్ జరుగుతుందనే అనుకుంది. కానీ.. ఎవ్వరూ ఊహించని రీతిలో ఇండియన్ ఆర్మీ దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంది. దీనివెనుక మోడీ మాస్టర్ మైండ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇప్పుడు కూడా పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరుగుతుండగా.. ఎన్కౌంటర్ చేయడంలోనూ ఏదో ప్లాన్ ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ - పాక్ సరిహద్దు్ల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు సైన్యాల మధ్య కాల్పులు జరగ్గా.. కశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న కొందరు సివిలియన్స్ కూడా మరణించారు. ఆ తర్వాత ట్రంప్ (Donald Trump) జోక్యంగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అనంతరం ట్రంప్ పలుమార్లు ఆ విషయాన్ని ప్రస్తావించడంతో.. ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ సమాధానం చెప్పాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ట్రంప్ వ్యా్ఖ్యలపై పార్లమెంట్ సాక్షిగా స్పందించాలని రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేశారు. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సమయంలో ఆపరేషన్ మహదేవ్ పేరుతో ఎన్కౌంటర్ నిర్వహించారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.






