‘స్వరాజ్యం’ రక్షణకు కట్టుబడి ఉన్నాం.. ‘ఆపరేషన్ సిందూర్’ ప్రత్యక్ష ఉదాహరణ: అమిత్ షా

by Phanindra |

‘స్వరాజ్యం’ రక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని, ‘ఆపరేషన్ సిందూర్’ ప్రత్యక్ష ఉదాహరణ అని అమిత్ షా అన్నారు.

‘స్వరాజ్యం’ రక్షణకు కట్టుబడి ఉన్నాం.. ‘ఆపరేషన్ సిందూర్’ ప్రత్యక్ష ఉదాహరణ: అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ విషయం ‘ఆపరేషన్ సిందూర్’తో నిరూపించామని ఆయన చెప్పారు. పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో మరాఠా వీరుడు ‘పీష్వా బాజీరావ్ -1’ విగ్రహావిష్కరణ సభలో షా మాట్లాడారు. ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఇంత కన్నా మంచి చోటు ఉండదని షా అభిప్రాయపడ్డారు. ‘నాకు చెడు ఆలోచనలు వచ్చిన ప్రతిసారీ బాల శివాజీ, పీష్వా బాజీరావునే గుర్తుచేసుకుంటా. పరిస్థితులు పూర్తి ప్రతికూలంగా ఉన్నప్పుడే వాళ్లు స్వరాజ్యాన్ని స్థాపించారు’ అని షా చెప్పారు.

ఇప్పుడు ఆ స్వరాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత 140 కోట్లమంది భారతీయులదని హోంమంత్రి అన్నారు. ‘స్వరాజ్యం ఏర్పాటు చేయడాని పోరాడాల్సి వస్తే మనం చేశాం. ఈ స్వరాజ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వస్తే మన నాయకత్వం కచ్చితంగా ఆ పాత్ర పోషిస్తుంది. ఆపరేషన్ సిందూర్ దానికి సరైన ఉదాహరణ’ అని షా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పీష్వా బాజీరావు -1కు అమిత్ షా నివాళులర్పించారు.

Next Story