- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ నాగ్ని.. కుప్వారాలో భారీగా ఆయుధాలు స్వాధీనం
ఆపరేషన్ మహదేవ్ (Operation Mahadev) పేరుతో గతవారం పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) కారణమైన ఉగ్రవాదుల్ని మట్టుపెట్టిన సైన్యం.. తాజాగా కుప్వారాలో ఆపరేషన్ నాగ్ని (Operation Nagni) నిర్వహించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ మహదేవ్ (Operation Mahadev) పేరుతో గతవారం పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) కారణమైన ఉగ్రవాదుల్ని మట్టుపెట్టిన సైన్యం.. తాజాగా కుప్వారాలో ఆపరేషన్ నాగ్ని (Operation Nagni) నిర్వహించింది. అక్కడ ఉగ్ర స్థావరాన్ని గుర్తించిన భద్రతా దరళాలు పెద్దసంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు, బీఎస్ఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు చినార్ కోర్ ఎక్స్ లో పోస్టు చేసింది. ఒక తుపాకీ, 12 గ్రనేడ్లు, 2 మ్యాగజైన్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 (Article 370) రద్దయి ఆరేళ్లు పూర్తయిన రోజునే భారీగా ఆయుధాలు దొరకడం సంచలనం రేపుతోంది. కాగా.. కుల్గాంలో నాలుగురోజులుగా నిర్వహిస్తున్న ఆపరేషన్ అఖాల్ లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. జులై 30న ఆపరేషన్ శివ్ శక్తిలో ఇద్దరు చొరబాటు దారుల్ని హతమార్చాయి.






