పైపుల ద్వారా ఆక్సిజన్, నీరు సప్లై.. 40 మంది కార్మికులు సేఫ్

by Disha Web Desk 2 |
పైపుల ద్వారా ఆక్సిజన్, నీరు సప్లై.. 40 మంది కార్మికులు సేఫ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగమార్గం శనివారం రాత్రి కుప్ప కూలిపోయిన విషయం తెలిసిందే. సుమారు 40 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. ఇవాళ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘటనా స్థలానికి చేరుకొని పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెస్క్యూ ఆపరేషన్‌లు వేగంగా జరుగుతున్నాయన్నారు. సొరంగంలో నీటి సరఫరా కోసం వేసిన పైప్‌లైన్‌ ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక అదే పైపు ద్వారా తాగునీరు, ఆహార పదార్థాలను కూడా సప్లై చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


Next Story