వారానికి ఒక రోజు బ్యాగ్ లెస్ స్కూల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

by Dishanational2 |
వారానికి ఒక రోజు బ్యాగ్ లెస్ స్కూల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో వారానికి ఒక రోజు ‘బ్యాగ్ లెస్ డే’గా పాటించాలని ఆదేశించింది. అంతేగాక 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు బ్యాగ్ బరువును నిర్దేశించింది. దీని ప్రకారం.. 1నుంచి 2 తరగతుల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ గరిష్ట బరువు 1.6 నుంచి 2.2 కిలోలు. అలాగే 3 నుంచి ఐదో తరగతి వరకు 1.7-2.5 కిలోలు, 6, 7 తరగతులకు 2-3 కిలోలు, 8వ తరగతికి 2.5-4 కిలోలు, 9, 10 తరగతి విద్యార్థులకు 2.5-4.5 వరకు ఉండాలని నిర్ణయించారు. బ్యాగుల భారంతో సతమతం కాకుండా.. పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వచ్చే వార్షిక సంవత్సరం నుంచి ఈ విధానాన్ని తప్పకుండా అమలు చేయాలని పేర్కొంది. ‘పిల్లలకు బ్యాగుల భారం కాకుండా ఉండేందుకు ఈ డెసిషన్ తీసుకున్నాం. విద్యార్థుల బ్యాగుల బరువును వారి తరగతికి అనుగుణంగా వర్గీకరించాం. అంతేగాక వారానికి ఒక రోజు ‘బ్యాగ్ లెస్ స్కూల్’ విధానాన్ని కూడా అమలు చేస్తాం’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. బ్యాగ్ లెస్ స్కూల్ విధానం ప్రకారం..ఆరోజు విద్యార్థులు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనేలా చేయడం. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఈ విధానం అమలులో ఉంటుంది.


Next Story