భారతదేశం మూడు ముక్కలైంది : ధర్మపురి అరవింద్

by Disha Web Desk 23 |
భారతదేశం మూడు ముక్కలైంది : ధర్మపురి అరవింద్
X

దిశ,బాల్కొండ : భారతదేశ అవతరించిన నాటి నుండి మూడుముక్కలైందని, మన దేశం నుంచి ముస్లింలకు ఇచ్చేశామని బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం మెండోరా ముప్కాల్ ల, బాల్కొండ మండల కేంద్రాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా మరోసారి గెలిపించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు రైతులకు ఏమి ఒరగబెట్టిందని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి సి ఏ, ఆర్ సి, యూనిఫార్మ్ సివిల్ కోర్టు పాపులేషన్ కంట్రోల్ మీద మీ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు. 500 సంవత్సరాలుగా నిర్మించలేని అయోధ్యలో రామ మందిరం నిర్మించారని. అదేవిధంగా మధురలో కృష్ణ మందిరం నిర్మించవలసి ఉంది అన్నారు. వీటన్నిటిని మీరు ఆహ్వానిస్తున్నారా అని ప్రశ్నించారు.పసుపు బోర్డు కొరకు 11 సంవత్సరాలు ఉద్యమం చేసిన మనోహర్ రెడ్డి చెప్పులు లేకుండా తిరగడన్నారు. పసుపు బోర్డు రాకుంటే ఈరోజు రైతులకు పసుపు పంట గిట్టుబాటు ధర రూపాయలు 19 వేలకు పైగా ఎలా వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో దాదాపు 25వేల రూపాయలు నుంచి 30 వేల రూపాయల వరకు పసుపు కు మద్దతు ధర వచ్చే అవకాశం ఉందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పెళ్లి అయితే తులం బంగారం, ప్రతి నెల పెన్షన్ రూ. 4000, ప్రతి మహిళకు రూ.2500, రైతులకు రూపాయలురూ. 500 బోనస్, రైతుబంధు రూ.15000 రైతులకు రుణమాఫీ చేసిండా అని ప్రశ్నలు గుప్పించారు.( ప్రసంగం నడుస్తున్న వేళ) ఎన్ని రకాలు ప్రచారంలో మాట్లాడుతున్న అరవింద్ సమీపంలో ఉన్న మజీద్ నుండి సమాజం మొదలవడంతో వ్యాoగాంగా అన్నారు. ఒక నిమిషం ఆగి నమాజ్ కాగానే తిరిగి మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి మసీదులలో ఉన్న 35 వేల స్పీకర్ల సౌండ్ లను తగ్గించారని తెలిపారు. అంతేకాకుండా మజీద్ లలోని పర్మిషన్ లేని పదకొండు వేల స్పీకర్లను కట్ చేయించారన్నారు. పూజ చేసుకుంటే దేశమంతా వినిపించాలని ఆయన ముందున్న ప్రజలను అడిగారు ఇందులో కావలసిన చట్టాలను రావాలంటే మరో మారు 400 సీట్లతో నరేంద్ర మోడీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మహిళలకు ఆర్థిక అభివృద్ధి కొరకు అందిస్తున్న లోన్ లు మోడీనే ప్రతి రూపాయి అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం రాయితీ ఇవ్వాల్సి ఉండగా మొండిచేయి చూపిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు శాతం రాయితీ ఇచ్చి మహిళలకు అండగా నిలుస్తుంది అన్నారు. కార్యక్రమంలో బీజేపీ బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ గల్ బాధితుల తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed