Punjab: పంజాబ్ లో వివాహ వేడుకల్లో అపశ్రుతి

by Shamantha N |

పంజాబ్ లోని వివాహ వేడుకలో అపశ్రుతి జరిగింది. పెళ్లివేడుకలో తప్పతాగి గాల్లోకి కాల్పులు జరగడంతో సర్పంచ్ భర్త చనిపోయాడు.

Punjab: పంజాబ్ లో వివాహ వేడుకల్లో అపశ్రుతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ లోని వివాహ వేడుకలో అపశ్రుతి జరిగింది. పెళ్లివేడుకలో తప్పతాగి గాల్లోకి కాల్పులు జరగడంతో సర్పంచ్ భర్త చనిపోయాడు. జలంధర్ జిల్లాలోని గోరయా గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివాహ వేడుకలో కొందరు డ్యాన్సులు చేస్తుండగా.. ఓ వక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన సర్పంచ్‌ భర్త 45 ఏళ్ల పరమ్‌జీత్‌ సింగ్‌ తన ముందు నుంచి వెళ్తుండగా అతడి ఛాతిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. దాంతో అతను కుప్పకూలి అరుస్తున్నా వినకుండా నిందితుడు మరో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఇతరులతో కలిసి కుప్పకూలిన పరమ్ జీత్ ను పైకి లేపాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

కాగా.. ఈ ఘటనపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముందుగా పోలీసులు, మృతుడి భార్య పరమ్‌జీత్‌ గుండెపోటుతో మరణించాడని చెప్పారు. నిందితుడిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ తర్వాత వీడియో వైరల్‌ కావడంతో అసలు విషయం బయటపడింది. దాంతో కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం నిందితుడి తీరు చూస్తుంటే వేడుకల్లో కాల్పుల పేరుతో పరమ్ జీత్ ను హత్య చేసినట్లు కన్పిస్తోంది.

Next Story