Toxic gas leak: మహారాష్ట్రలో ఒలియం గ్యాస్ లీక్‌.. తప్పిన ప్రమాదం

by Ramesh Naini |

మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని ఎంఐడీసీ డీ-జోన్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న భగేరియా కెమికల్స్ ఫ్యాక్టరీలో సోమవారం మధ్యాహ్నం ఒలియం (గ్యాస్) వాయువు లీక్ ఘటన చోటుచేసుకుంది.

Toxic gas leak: మహారాష్ట్రలో ఒలియం గ్యాస్ లీక్‌.. తప్పిన ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని ఎంఐడీసీ డీ-జోన్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న భగేరియా కెమికల్స్ (మాజీ జెనిత్ కెమికల్స్) ఫ్యాక్టరీలో సోమవారం మధ్యాహ్నం ఒలియం (గ్యాస్) వాయువు లీక్ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాయు లీక్ వెలుగులోకి రావడంతో అగ్నిమాపక దళం, పోలీసు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని లీక్ నియంత్రణ చర్యలు చేపట్టాయి. సమీపంలోని సాల్వాడ్, పస్థల్ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ప్రాంతానికి దూరంగా ఉండాలి..

ప్రజలు ప్రభావిత ప్రాంతానికి దూరంగా ఉండాలని, తడి గుడ్డ లేదా మాస్క్‌తో ముక్కు, నోరు కప్పుకోవాలని, అవసరమైతే గ్లవ్స్, కళ్లద్దాలు వాడాలని అధికారులు తెలిపారు. భయాందోళనలకు లోనుకాకుండా అధికారుల సూచనలను పాటించాలని జిల్లా కలెక్టర్ డా. ఇందు రాణి జాఖర్ ప్రజలను కోరారు. కాగా, ప్రభావిత ప్రాంతంలో 2,600 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించినట్లు అధికారుల సమాచారం.

Next Story