హిమాలయాల్లో మిస్సైన అణు పరికరం.. భారీ ప్రమాదం తప్పదా?

by Muthe.Rajitha |

ఇతర దేశాల ఇదా నిఘా కోసం భారత్ ఓ అణు పరికరాన్ని హిమాలయాల్లో అమర్చింది.

హిమాలయాల్లో మిస్సైన అణు పరికరం.. భారీ ప్రమాదం తప్పదా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఇతర దేశాల ఇదా నిఘా కోసం భారత్ ఓ అణు పరికరాన్ని హిమాలయాల్లో అమర్చింది. అయితే ప్రస్తుతం దాని జాడ లభించక ఆందోళన చెందుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 1965లో చైనా అణు కార్యక్రమాలపై నిఘా కోసం భారత్ అమెరికా CIA కలిసి హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే ఓ నిఘా పరికరాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. అనుకున్నట్టుగానే సిబ్బంది, అధికారులు నందాదేవి శిఖరం మీదకి చేరిన సమయంలో తీవ్ర మంచు తుఫాను సంభవించింది.

అయితే ఆ మంచు తుఫాను నుంచి తప్పించుకునే క్రమంలో ఆ అణు పరికరాన్నిఅక్కడే వదిలేసి అంతా శిఖరం కింది క్యాంపుకి తిరిగి వచ్చారు. అయితే 2 రోజులు గడిచాకా మంచు తుఫాను శాంతించడంతో మళ్ళీ అధికారులంతా శిఖరం పైకి చేరుకున్నారు. కానీ అనూహ్యంగా అక్కడ అణు పరికరం వారికి కనబడలేదు. అంతా కలిసి అనేక గంటలపాటు వెతికినా దాని జాడ దొరకలేదు. అయితే మంచులో కూరుకుపోయి ఉంటుందని భావించి దాని మీద ఆశలు వదిలేసుకున్నారు.

కాగా ఇటీవల హిమానినాదాలు వేగంగా కరిగిపోతుండటంతో ఆ అణు పరికరంలో రేడియోధార్మిక పదార్థం లీకయ్యి పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమనీనాదాలు కరిగి నదుల్లోకి ప్రవహిస్తుండగా.. అణు పదార్థం లీక్ అయితే నదులన్నీ కలుషితం అవుతాయని, దాంతో లక్షలాది మంది రేడియోధార్మికత బారిన పడతారాని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయాలన్నీ.. ఇటీవల బీజేపీ ఎంపీ నిశికాంత్ ట్వీట్ తో బయటికి రాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ అవుతోంది.

Next Story