- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NSA Ajit Doval : ఎస్-400 విషయంపై రష్యాతో చర్చలు జరపనున్న దోవల్
ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ముందస్తు డెలివరీల అంశంపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చేవారం రష్యాలో పర్యటించనున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ముందస్తు డెలివరీల అంశంపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చేవారం రష్యాలో పర్యటించనున్నారు. మే 27 నుంచి 29 వరకు భద్రతా వ్యవహారాల ఉన్నతస్థాయి ప్రతినిధుల 13వ అంతర్జాతీయ సమావేశం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు దోవల్ (Ajit Doval) మాస్కోకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇదే పర్యటనలో ఆయన రష్యా (Russia) వద్ద పెండింగ్‌లో ఉన్న ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ముందస్తు డెలివరీ అంశంపై చర్చించనున్నారు. పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ దోవల్ పర్యటన ప్రాధాన్యంగా మారింది.
ఆపరేషన్ సిందూర్
మరోవైపు, ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ సమయంలో మన ఎస్-400 కీలక పాత్ర పోషించింది. వైమానిక, క్షిపణి దాడులకు దిగితే నిలువరించే అత్యంత శక్తిమంతమైన ఎస్ -400 ఆయుధ వ్యవస్థ శత్రువులకు చుక్కలు చూపించింది. కాగా.. ఎస్ -400 ని వీటిని రష్యాకు చెందిన ఎన్‌పీవో అల్మాజ్ సంస్థ అభివృద్ధి చేసింది. మొత్తం ఐదు ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు 2018లో భారత్-రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.35వేల కోట్లు. ఇప్పటివరకు మూడు వ్యవస్థలు భారత్‌కు చేరగా.. మిగతా వాటిని 2026 ఆగస్టు నాటికి అందించే అవకాశాలున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, అంతకంటే ముందుగానే వీటిని డెలివరీ చేసేలా దోవల్ మాస్కోతో చర్చించనున్నట్లు సమాచారం.






