- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NOTA: జాతీయ పార్టీల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు.. ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఓటమి పాలవ్వగా.. బీజేపీ ఘన విజయం సాధించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ (Delhi assembly) ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) ఓటమి పాలవ్వగా.. బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ మరోసారి ఖాతా తెరవలేదు. అయితే ఈ ఎన్నికల్లో పలు అనూహ్య ఫలితాలు వచ్చాయి. రెండు జాతీయ పార్టీల (National parties) కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నోటాకు 0.57శాతం ఓట్లు పోలవ్వగా నేషనల్ పార్టీలైన బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ)కి 0.55, సీపీఎంకు 0.1శాతం ఓట్ షేరింగ్ నమోదైంది. అలాగే సీపీఐకి 0.01, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) 0.53 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక, బీజేపీకి 40.70 శాతం, ఆప్ కు 43.54శాతం ఓట్లు నమోదయ్యాయి. ఇక, మూడోసారి కూడా దేశ రాజధానిలో ఖాతా తెరవని కాంగ్రెస్ పార్టీకి 6.35 శాతం ఓట్ షేరింగ్ నమోదు కాగా గతంలో కంటే 2శాతం పెరగడం గమనార్హం. కాగా, ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలు ఉన్నాయి. అందులో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం. నేషనల్ పీపుల్స్ పార్టీ (National peoples party), ఆప్‌లు ఉన్నాయి.






