PM Modi: చనిపోయిన నా తల్లిని కూడా అవమానించారు.. కాంగ్రెస్ పై మోడీ ఫైర్

by Prasad Jukanti |

తన తల్లిని దూషించడం పట్ల ప్రధాని మోడీ స్పందించారు.

PM Modi: చనిపోయిన నా తల్లిని కూడా అవమానించారు.. కాంగ్రెస్ పై మోడీ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన తల్లిపై రాజకీయ విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Modi) స్పందించారు. నా తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా చనిపోయిన నా తల్లిని కూడా రాజకీయాల్లోకి లాగారాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ తల్లినీ కాంగ్రెస్, ఆర్జేడీ అవమానించిందన్నారు. ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మోడీ.. ఇటీవల బిహార్ లో రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా కొందరు ప్రధాని మోడీ తల్లిని దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన మోడీ.. ఈ వ్యాఖ్యలు కేవలం తన తల్లిని మాత్రమే అవమానించినట్లు కాదని దేశంలోని ప్రతి తల్లినీ అవమానిచినట్లు అన్నారు. సాంప్రదాయాలకు నిలయమైన బీహార్‌లో ఇలాంటి చర్య జరుగుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని.. రాజకుటుంబంలో జన్మించిన యువరాజులు ఒక పేద తల్లి బాధను ఆమె కొడుకు పోరాటాలను అర్థం చేసుకోలేరని రాహుల్ గాంధీ, తేజశ్వీ యాదవ్ ను టార్గెట్ చేసుకుని విమర్శించారు.

Next Story