- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూజీసీ నూతన మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలి
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ కొత్త నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, యూసీ కలిసి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీస్తున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు.

- దేశ సమాఖ్య స్పూర్తికి విఘాతం
- అమలు చేస్తే శాసనసభల అధికారాలు ఉల్లంఘనే
- దక్షిణాదిలో నాన్-బీజేపీ ప్రభుత్వాల వ్యతిరేకత
- కేరళ సీఎం పినరయ్ విజయన్
దిశ, నేషనల్ బ్యూరో:
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రూపొందించిన డ్రాఫ్ట్ నిబంధనలను దక్షిణాదిలోని ఎన్డీయేతర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. యూజీసీ రెగ్యులేషన్స్ 2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు పునరుద్గాటించాయి. తిరువనంతపురంలో నిర్వహించిన నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ కన్వెన్షన్‌లో కేరళ సీఎం పినర్ విజయన్ మాట్లాడుతూ.. యూజీసీ ప్రతిపాదిత మార్గదర్శకాలు ఉన్నత విద్యలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను తగ్గిస్తాయని చెప్పారు. ఈ నిబంధనల కారణంగా ఆయా రాష్ట్రాల శాసన సభల అధికారాలను, ముఖ్యంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాల వీసీల నియామకానికి సంబంధించిన అధికారాలను ఉల్లంఘించబడతాయిన విజయన్ అభిప్రాయపడ్డారు. విద్యాయేతర వ్యక్తులను వైస్ ఛాన్స్‌లర్లుగా నియమించడాన్ని విజయన్ వ్యతిరేకించారు. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని, భవిష్యత్‌లో విద్యా ప్రమాణాలకు హానికరమని అన్నారు. గతంలో అధ్యాపకుల పదోన్నతుల్లో జవాబుదారీతనాన్ని నిర్ధారించే అకాడెమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ వ్యవస్థను తొలగించడాన్ని కూడా విజయన్ తప్పుబట్టారు.
ఇక తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ కొత్త నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, యూసీ కలిసి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీస్తున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇదెలా ఉందంటే.. బిల్లు మీరు చెల్లించండి.. కానీ ఆహారాన్ని మాత్రం ఆర్డర్ చేయకండి అన్నట్లు ఉందని భట్టి ఆరోపించారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కోసం నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో విద్యార్థుల నమోదుకు ఇవి ఆటంకం కలిగిస్తాయని అన్నారు. దీని వల్ల అణగారిన వర్గాల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ప్రతీ సంస్థకు 3 వేల మంది విద్యార్థుల కనీస నమోదు ప్రమాణాన్ని కూడా భట్టి వ్యతిరేకించారు. ఇది వెనుకబడిన ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న కళాశాలలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.






