- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా ఉద్యోగుల భద్రతకు సరికొత్త ఆదేశాలు..రాత్రివేళల్లో అమల్లోకి కఠిన నియమాలు
గత కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో డీగఢ్ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: గత కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో డీగఢ్ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మహిళా ఉద్యోగులు రాత్రిపూట ఒంటరిగా ప్రయాణించకూడదని ఆదేశించారు. భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్ 163 కింద ఆయన తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై చండీగఢ్‌లోని BPOలు, కాల్ సెంటర్లు, మీడియా హౌసులు, కార్పొరేట్ ఆఫీసులు, కంపెనీలు, సెక్యూరిటీ ఏజెన్సీలు తదితర సంస్థలు తమ ఉద్యోగుల భద్రతకు నిర్దిష్ట మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలి.
కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. ప్రతి సంస్థ తమ ఉద్యోగులు, డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది, కాంట్రాక్టు వర్కర్ల వివరాలు పోలీస్ లేదా ప్రభుత్వ విభాగాలు అడిగినప్పుడు అందుబాటులో ఉంచాలి.
2. మహిళా ఉద్యోగులు రాత్రి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఒంటరిగా ప్రయాణించరాదు. అటువంటి సందర్భాల్లో డ్రైవర్‌తో పాటు సెక్యూరిటీ గార్డు, పురుష సహోద్యోగి తప్పనిసరిగా ఉండాలి.
3. రాత్రి వేళల్లో మహిళలను ఇళ్ల వద్దే డ్రాప్ చేయాలి. వారు సురక్షితంగా చేరినట్టు టెలిఫోన్ ద్వారా ధృవీకరించే వరకు కారు ఆ పాయింట్ వద్దే ఆగి ఉండాలి.
4. మహిళ ఉద్యోగి ఇల్లు వాహనం చేరలేని ప్రాంతంలో ఉంటే, సెక్యూరిటీ గార్డు, పురుష సహోద్యోగి ఆమెతో నడిచి వెళ్లి సురక్షితంగా చేరినట్టు నిర్ధారించాలి.
5. ప్రతి వాహనంలో GPS సిస్టమ్ తప్పనిసరిగా ఉండాలి.
6. అనుమానాస్పద కదలికలు, అనుచిత వ్యక్తుల ప్రవర్తన గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
ఈ తాజా ఉత్తర్వులు 2025 నవంబర్ 10వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చి, 2026 జనవరి 8 వరకు కొనసాగుతాయి. మహిళా ఉద్యోగుల భద్రతకు గట్టి పునాది వేస్తున్న ఈ ఆదేశాలు ప్రస్తుతం చండీగఢ్ అంతటా చర్చనీయాంశంగా మారాయి.






