- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Thackeray Family: అప్పుడే రాజకీయ పొత్తు లేదు, తుది నిర్ణయం రాజ్-ఉద్ధవ్ ఠాక్రేలదే
కేవలం తాజా పరిణామాల మధ్య మాత్రమే కలిశారని చెప్పారు. ఇదొక భావోద్వేగ కలయిక మాత్రమేనన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా మారాష్ట్రలో హిందీ తప్పనిసరి చేయాలంటూ ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయించిన తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశం నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు భారీ మార్పులకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు దశాబాల క్రితం విడిపోయిన ఠాక్రె కుటుంబం మళ్లీ కలవనున్నట్టు ఊహాగానాలు వినిపించాయి. 2005లో శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్ ఠాక్రె సొంతంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని స్థాపించారు. అప్పటినుంచి ఉద్ధవ్ ఠాక్రె, రాజ్ ఠాక్రెల మధ్య రాజకీయ విభేదాలు పెరిగాయి. అయితే తాజాగా మరాఠీ మీడియం విద్యార్థులకు కూడా హిందీ తప్పనిసరిగా బోధించాలని ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఠాక్రె కుటుంబం మళ్లీ కలవనుందనే విషయం చర్చకు వచ్చింది. అయితే, ఆదివారం ప్రకటనలో ఉద్ధవ్ సేన ఎంపీ సంజయ్ రౌత్, ఇద్దరు ఠాక్రెల మధ్య పొత్తు గురించి ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కేవలం తాజా పరిణామాల మధ్య మాత్రమే కలిశారని చెప్పారు. ఇదొక భావోద్వేగ కలయిక మాత్రమేనన్నారు. రాజకీయ అంశంలో ఇద్దరు ఠాక్రె నేతలు చేతులు కలపడం, భవిష్యత్తు పొత్తు విషయానికి సంబంధించి వారిదే తుది నిర్ణయమని తెలిపారు. ఇద్దరు సోదరుల మధ్య సంబంధాలు ఎన్నడూ కుంటుపడలేదు. తాజా పొత్తుపై వారిద్దరే నిర్ణయిస్తారని సంజయ్ రౌత్ వెల్లడించారు. ఉద్ధవ్ ఠాక్రె మాటలకు అనుసరిస్తాం. మహారాష్ట్ర కోసం కలిసి పనిచేయాలంటే అందుకు సిద్ధమేనని అన్నారు. ఇప్పటికే శివసేన(ఉద్ధవ్) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రె తన సోదరుడిని విభేదాలు పక్కనపెట్టి, రాష్ట్ర ప్రజలు, మరాఠీ భాష కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.






