- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లా ఖాళీ చేసేది లేదు : RJD
by Muthe.Rajitha |
బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి రెండు దశాబ్దాలుగా నివసిస్తున్న పాట్నా అన్నే మార్గ్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నితీశ్ కుమార్ ప్రభుత్వం ఆదేశించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి రెండు దశాబ్దాలుగా నివసిస్తున్న పాట్నా అన్నే మార్గ్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నితీశ్ కుమార్ ప్రభుత్వం ఆదేశించింది. శాసన మండలి ప్రతిపక్ష నేతగా హార్డింజ్ రోడ్‌లోని మరో బంగ్లాకు మారాలని సూచించింది. దీనికి ఆర్జేడీ తీవ్రంగా స్పందించింది. మాజీ ముఖ్యమంత్రులకు జీవితకాలం నివాస హక్కు ఉందని, రబ్రీ దేవి ఆ బంగ్లాను ఖాళీ చేయబోరని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంగని లాల్ మండల్ స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ మాత్రం మాజీ సీఎంలకు జీవితకాల బంగ్లా హక్కును అలహాబాద్ హైకోర్టు రద్దు చేసిందని, బంగ్లా కేటాయింపు పూర్తిగా ప్రభుత్వ అధికారమేనని వెల్లడించారు.
Next Story






