గుండుపిన్నంతా స్థలాన్ని కూడా ఆక్రమించుకోలేరు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా

by Dishafeatures2 |
గుండుపిన్నంతా స్థలాన్ని కూడా ఆక్రమించుకోలేరు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్క్: భారత భూభాగంలోంచి గుండుపిన్నంతా స్థలాన్ని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం అరుణాచల్ ప్రదేశ్ లో ని కిబితూ గ్రామంలో ‘వైబ్రేంట్ విలేజెస్ ప్రోగ్రాం’ను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత భూభాగంలో ప్రతి అంగుళం సురక్షితంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం చూస్తోందని అన్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని, సరిహద్దులను రక్షించుకునేందుకు మన రక్షణ దళాలు, నాయకత్వం సమర్థవంతంగా పని చేస్తున్నాయని అన్నారు.

‘‘మన భూభాగాన్ని పరాయి దేశాలు ఆక్రమించుకునే రోజులు పోయాయి. గుండుపిన్నంతా స్థలాన్ని కూడా పోనిచ్చేది లేదు. దేశం మొత్తం ప్రశాంతంగా నిద్రపోవడానికి ఐటీబీటీ జవాన్లు, ఇండియన్ ఆర్మీ నిరంతరం గస్తీ కాస్తున్నారు. మన ఆర్మీ శక్తిని చూసి మనవైపు చూడటానికి కూడా వాళ్లకు ధైర్యం చాలదు’’ అని అమిత్ షా అన్నారు. 2014కు మందు ఈశాన్య రాష్ట్రాలు అభద్రతాభావంలో ఉండేవన్న ఆయన.. మోడీ చేపట్టిన ‘లుక్ ఈస్ట్’ పాలసీ వల్ల పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని అన్నారు. ఈ 9 ఏళ్లలో దేశాభివృద్ధికి తోడ్పడే స్థాయికి ఈశాన్య రాష్ట్రాలు ఎదిగాయని కేంద్ర హోంమంత్రి అన్నారు. కాగా అరుణాచల్ లో రెండు రోజులు పాటు సాగనున్న అమిత్ షా పర్యటనను చైనా వ్యతిరేకిస్తోంది.



Next Story

Most Viewed