- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pakistan: ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. సిమ్లా ఒప్పందంపై పాక్ స్పందనిదే..
సిమ్లా ఒప్పందంపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌తో 1972లో జరిగిన సిమ్లా ఒప్పందం నుంచి వైదొలగే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: సిమ్లా ఒప్పందంపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌తో 1972లో జరిగిన సిమ్లా ఒప్పందం నుంచి వైదొలగే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ మాట్లాడుతూ సిమ్లా ఒప్పందానికి ఇక విలువలేదు.. అదొక డెడ్ డాక్యుమెంట్ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ‘‘భారత్‌తో ఏ ద్వైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం ఆ దేశంతో ఉన్న సిమ్లా ఒప్పందంతో సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు అమల్లో ఉంటాయి’’ అని ఆ దేశానికి చెందిన ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌కు వెల్లడించారు. ఇకపోతే, 1971లో భారత్-పాక్ యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందం జరిగింది. దీని ప్రకారం భారత్-పాక్ సంబంధాల నిర్వహణకు సంబంధించిన చర్యలు తీసుకొంటారు.
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ మాట్లాడుతూ సిమ్లా ఒప్పందంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధూజలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేశారో లేదో తెలియదు గానీ.. సిమ్లా అగ్రిమెంట్ పనైపోయింది అని పేర్కొన్నారు. దీంతో తాము 1948 నాటి స్థితికి చేరుకొన్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నియంత్రణ రేఖ కాస్తా కేవలం కాల్పుల విరమణ రేఖగా భావిస్తామన్నది ఆయన ఉద్దేశం. 1948 భారత్-పాక్ యుద్ధం తర్వాత దీనిని ఏర్పాటు చేశారు. ఇకపోతే, సిమ్లా ఒప్పందం ద్వారా శాంతియుత ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు తీర్మానించాయి. ఇందులో కశ్మీర్ అంశమూ ఉంది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు. దీని ప్రకారం ఇరుదేశాలు మూడో దేశం జోక్యం లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి. జమ్మూ కశ్మీర్‌లో కాల్పుల విరమణ లైన్‌గా నియంత్రణ రేఖను పునర్నిర్వచించడం. దానిని మార్చకూడదన్న నిర్ణయానికి రెండు దేశాలు కట్టుబడటం. బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని గుర్తించడంతోపాటు ఆ దేశంతో సంబంధాలను సాధారణ స్థితికి తేవడానికి పాకిస్థాన్ కట్టుబడటం వంటి అంశాలున్నాయి.






