కాబోయే చిన్న కోడలికి నీతా అంబానీ స్పెషల్ గిఫ్ట్.. దాని విలువ తెలిస్తే షాక్!

by Ramesh Goud |
కాబోయే చిన్న కోడలికి నీతా అంబానీ స్పెషల్ గిఫ్ట్.. దాని విలువ తెలిస్తే షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అపరకుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్ లోని జామ్ నగర్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో అంబానీ ఫ్యామిలీ కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్ కు ఎన్నో విలువైన కానుకలు ఇచ్చారని వార్తలు వచ్చాయి. నీతా అంబానీ ఏకంగా కోట్లు విలువ చేసే తన డైమండ్ నెక్లెస్ ను చిన్న కోడలుకు కానుకగా ఇచ్చినట్లు తెలిసింది. ఈ ప్రేమ జంట పెళ్లికి దగ్గర అవుతున్న తరుణంలో నీతా అంబానీ కాబోయే చిన్న కోడలికి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనుందని తెలుస్తోంది. రాధికా మర్చంట్ కు పెళ్లి కానుకగా దుబాయ్ లోని 640 కోట్ల విలువ చేసే విల్లాను గిఫ్ట్ గా అందించనున్నారు.

ఈ విల్లాలో 10 విలాసవంతమైన బెడ్‌రూమ్ లు, ఆకర్షణీయమైన ఇంటీరియర్, అద్భుతమైన వాల్ డిజైనింగ్స్ ఉన్నామని తెలిసింది. ఈ భవనానికి ఆనుకొని 70 మీటర్ల మేర ప్రైవేట్ బీచ్ ఉండటం స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. అయితే దీనికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ విల్లా అంబానీ ఫ్యామిలీ మొత్తం బస చేయడానికి సరిపోయేలా.. భారీ పార్టీలు కూడా ఏర్పాటు చేసుకునే విధంగా డిజైన్ చేయించారని తెలిసింది. నీతా అంబానీ దీనిని తన చిన్న కుమారునికి కాబోయే భార్యకు గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించుకుంది. కాగా అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ల నిశ్చితార్ధం 2022 లో జరగగా.. ఇటీవలే అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్ కూడా జరిగిపోయింది. ఇక జూలైలో ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్, ఎన్ఎంఏసీసీ అధ్యక్షురాలిగా ఉన్న నీతా అంబానీ నూతన వధువరులకు ఇంకెన్ని కానుకలు ఇస్తారోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Next Story

Most Viewed