- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూకశ్మీర్‌లోని 35 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
పహెల్గామ్ దాడి తరవాత ఎన్ఐఏ ఉగ్రకార్యకలాపాలపై డేగ కన్నువేసింది. ఈ నేపథ్యంలో వరుస సోదాలు నిర్వహిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: పహెల్గామ్ దాడి తరవాత ఎన్ఐఏ ఉగ్రకార్యకలాపాలపై డేగ కన్నువేసింది. ఈ నేపథ్యంలో వరుస సోదాలు నిర్వహిస్తోంది. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని 32 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఎల్ఈటీ మరియు జేఈఎం యొక్క ఉగ్రవాద సంస్థలతో పాటూ ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించింది.
ఉగ్రవాదులకు సహాయం చేయడం, ఐఈడీలు మరియు బాంబుల తయారీ, మాదక ద్రవ్యాలు ఆయుధాలను ఉగ్రవాదులకు సరఫరా చేయడంతో స్థానిక యవతను తీత్రవాదం వైపు మళ్లిస్తున్నారనే సమాచారంతో ఎన్ఐఏ దాడులు చేసినట్టు తెలుస్తోంది. జమ్మకశ్మీర్‌లో హింసను ప్రేరేపించడానికి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలు జమ్మూలోని కొన్ని గ్రూపులకు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ సోదాల్లో రెండు లైవ్ కార్ట్రిడ్జ్‌లు, కాల్చిన బుల్లెట్ హెడ్ మరియు బయోనెట్ స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.






