- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Two wheeler Toll fee: టూ వీలర్లకూ టోల్ విధిస్తారన్న ప్రచారాన్ని ఖండించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేలపై టూవీలర్లకు టోల్ ఫీజు వసూలు చేస్తుందనే కథనాలు గురువారం సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొట్టాయి. జూలై నుంచి ప్రభుత్వం ద్విచక్ర వాహనాలపై టోల్ విధించాలని భావిస్తోందని అనేక మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే, దీనిపై కేంద్రం స్పందించింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అవాస్తవ ప్రచారాలపై మండిపడ్డారు. ఈ విషయంలో స్పష్టత కూడా ఇచ్చారు. జూలై 15 నుంచి బైకులకు టోల్ ఫీజు అమలవుతుందని జరిగే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. అటువంటి ఉద్దేశం కూడా లేదని, కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు విషయంలో పూర్తిగా మినహాయింపు ఉంటుంది. సంచలనం సృష్టించడానికే ఇలాంటి తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నారు, మెరుగైన జర్నలిజానికి ఇది సరికాదు. దీనిని ఖండిస్తున్నానని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ద్విచక్ర వాహనాలపై టోల్ వసూలు చేసే ప్రణాళికలేవీ లేవని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) స్పష్టం చేసింది. ప్రస్తుతం నేషనల్ హైవేలపై ప్రయాణించేందుకు టూవీలర్లకు ఎలాంటి టోల్ ఫీజు లేదు. దీనికి సంబంధించి ఎన్‌హెచ్ఏఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో స్పష్టత ఇచ్చింది. అటువంటి పుకార్లను నమ్మవద్దని పేర్కొంది. టూవీలర్లపై టోల్ ఫీ అనే అంశమే ప్రతిపాదనలో లేదని తేల్చేసింది.






