7 రోజుల్లో 156 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం.. న్యూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్

by Muthe.Rajitha |

కేవలం 7 రోజుల్లో ఏకంగా 156 కిలోమీటర్ల రహదారిని నిర్మించారు.

7 రోజుల్లో 156 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం.. న్యూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్ : కేవలం 7 రోజుల్లో ఏకంగా 156 కిలోమీటర్ల రహదారిని నిర్మించారు. అది కూడా ఎకనమిక్ కారిడార్ మార్గంలో. ఈ కృషికి గుర్తింపుగా NHAI గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి చేరింది. బెంగుళూరు–కడప–విజయవాడ ఆరు వరుసల ఎకనమిక్ కారిడార్ నిర్మాణంలో ఈ రికార్డు నెలకొల్పడంపై కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. హైవే ఇంజినీరింగ్ రంగంలో ఇది హిస్టరీ రికార్డు అని, ప్రపంచ స్థాయిలో భారత్ కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని కొనియాడారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఏపీలోని పుట్టపర్తి వద్ద జనవరి 5 నుంచి 11వ తేదీ వరకు NHAI వారం రోజులపాటు ఆగకుండా రాత్రింబవళ్లు బిటుమినస్ కాంక్రీట్ రోడ్డు పనులు చేపట్టి.. రికార్డు స్థాయిలో 156 లేన్ కిలోమీటర్ల రహదారిని పూర్తి చేసారు. ఇందుకోసం 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ ను వాడినట్లు అధికారులు తెలిపారు. దీంతో గతంలో ఉన్న 84.4 కిలోమీటర్ల ప్రపంచ రికార్డును NHAI బద్దలు కొట్టింది. ఈ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి, కార్మికులకు నితిన్ గడ్కరీ అభినందనలు తెలిపారు.

Next Story