మీరే ఇలా ఉంటే పిల్లలకేం చెప్తారు? చెక్కుపై అక్షరాలు సరిగా రాయలేకపోయిన గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్

by Prasad Jukanti |   (  Updated:2025-09-30 10:04:54  IST  )

ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ రాసిచ్చిన చెక్కును బ్యాంకు తిరస్కరించింది.

మీరే ఇలా ఉంటే పిల్లలకేం చెప్తారు? చెక్కుపై అక్షరాలు సరిగా రాయలేకపోయిన గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: లెవెన్ నంబర్ స్పెల్లింగ్ రాని సర్కార్ బడి పంతులు తెలివి తనం మర్చిపోకముందే తాజాగా ఓ ప్రిన్సిపాల్ (principal) స్పెల్లింగ్ మిస్టెక్స్ సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. హిమాచల్ ప్రదేశ్‍లోని (Himachal Pradesh) ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ రాసిచ్చిన చెక్కును బ్యాంకు తిరస్కరించింది. ఈ రిజెక్షన్‍కు కారణం ఏంటా అని ఆలోచిస్తే ప్రిన్సిపాల్ రాసిన స్పెల్లింగ్ మిస్టేక్స్ అని తేలింది. సెప్టెంబర్ 25వ తేదీన ‘ద హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్’ కు చెందిన చెక్కుపై అట్టర్ సింగ్ పేరుతో రూ.7,616కు ప్రిన్సిపాల్ సంతకం చేసి ఇచ్చారు. నంబర్స్ లో సరిగానే రాసిన ఇంగ్లీష్ అక్షరాల్లో మాత్రం తప్పులు రాశారు. ఇంగ్లీష్‍లో సెవెన్ రాయాల్సిన చోట సావెన్ అని థౌజండ్ రాయాల్సిన చోట థర్స్ డే, హండ్రెడ్ కు బదులు హరేంద్ర, సిక్స్ టీన్‍కు బదులు సిక్స్టీ అని రాశారు. ఈ తప్పుల తడకగా ఉన్న చెక్కును బ్యాంక్ తిరస్కరించగా ఇప్పుడు ఈ చెక్కు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఈ చెక్కును సీనియర్ సెంకడరీ స్కూల్ ప్రిన్సిపాలే రాశారా లేక మరెవరైనా రాశారా అనే చర్చ జరుగుతోంది. ఒక వేళ ప్రిన్సిపాల్ స్వయంగా రాయకపోయినా ఆయన సంతకంతో చెక్కు బయటకు వచ్చింది కాబట్టి సంతకం చేసే ముందు స్పెల్లింగ్ ను చెక్ చేసుకోవడంలో ఆయన విఫలం అయ్యారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రిన్సిపాలే ఇలా సుద్ద మొద్దు అయితే పిల్లలకు ఇంకేం చదువు చెప్తారంటూ విమర్శిస్తున్నారు.

Next Story