ప్రతి వర్గానికి సాధికారత కల్పించేందుకు కృషి: ప్రధాని మోడీ

by Disha Web Desk 12 |
ప్రతి వర్గానికి సాధికారత కల్పించేందుకు కృషి: ప్రధాని మోడీ
X

జైపూర్: నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వాలనే మంత్రంతో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తమ ప్రభుత్వం సమాజంలోని ప్రతి వర్గాన్ని సాధికారత కల్పించేందుకు పని చేస్తుందని చెప్పారు. శ్రీదేవనారయణ్ 1111వ అవతార ఉత్సవాల సందర్భంగా రాజస్థాన్ భిల్వారా జిల్లాలో ఆయన ప్రసంగించారు. భారతదేశం వైవిధ్యభరితమైన వారసత్వ వేడుకలు జరుపుకోవడం ద్వారా అద్వితీయమైన ధైర్యవంతులను స్మరించుకోవడం తో తన గత తప్పులను సరిదిద్దుకుందని అన్నారు.

లెక్కలేనన్ని యోధులకు మన చరిత్రలో వారికి దక్కవలసిన స్థానాన్ని పొందలేకపోవడం దేశ దురదృష్టమని చెప్పారు. దేశాన్ని భౌగోళికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, ఆలోచన పరంగా విడదీయాలని చాల ప్రయత్నాలు జరిగినా అది సాధ్యం కాలేదని తెలిపారు. భారత్ అంటే కేవలం భూమి మాత్రమే కాదని.. నాగరికత, సామర్థ్య వ్యక్తీకరణ అని అన్నారు. ప్రస్తుత భారత్ బంగారు భవితకు పునాదులు వేసుకునే దశలో ఉందన్నారు.

శ్రీదేవనారయణ్ ప్రజల సంక్షేమం, మానవత సేవలను ప్రధాని గుర్తు చేశారు. గత ఎనిమిదేళ్లలో వెనుకబడిన ప్రతి వర్గానికి సాధికారత కల్పించేందుకు భారత్ ప్రయత్నిస్తుందని చెప్పారు. మన వారసత్వంపై గర్వపడుతూ, బానిస మనస్తత్వం నుండి బయటపడి, దేశం పట్ల మన కర్తవ్యాలను గుర్తుంచుకుందామని అన్నారు.

ఇవి కూడా చదవండి: 6 గంటల్లో 20 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన గౌతం అదానీ


Next Story

Most Viewed