ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం

by Gantepaka Srikanth |

ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం వెలుగుజూసింది. ఐఈడీ రవాణా చేస్తుండగా పేలి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం వెలుగుజూసింది. ఐఈడీ రవాణా చేస్తుండగా పేలి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐఈడీని మరో చోటుకు తరలిస్తున్న క్రమంలో.. దారిలో ప్రమాదవశాత్తు పేలి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పేలుడు ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ పేలుడులో 13 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సంతాపం తెలియజేశారు.

Next Story